ఒంగోలు నగరంలోని స్పా సెంటర్లపై దాడులు నిర్వహించిన ప్రకాశం పోలీసు బృందాలు -స్పా సెంటర్ల పేరుతో చట్టవిరుద్ధమైన, అసాంఘిక మరియు అనైతిక కార్యకలాపాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు

చట్టవ్యతిరేక, అసాంఘిక మరియు అనైతిక కార్యకలాపాలు కట్టడే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు మహిళ పోలీస్ స్టేషన్ యు.సుధాకర్ ఆధ్వర్యంలో ఒంగోలు టాస్క్ ఫోర్స్ సిబ్బంది శనివారం ఒంగోలు టౌన్ లోని నెల్లూరు బస్టాండ్ సెంటర్ లో ఉన్న స్పా సెంటర్స్ పై తనిఖీలు నిర్వహించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఒంగోలు, నెల్లూరు బస్టాండ్ వద్ద ఉన్న స్పాసెంటర్ లో నిర్వాహకురాలు మరియు అసాంఘిక కార్యక్రమాలకు పాల్గొనేందుకు వచ్చిన ఒంగోలుకు చెందిన పసుపులేటి భాను ప్రకాష్ వ్యక్తిపై మరియు స్పా సెంటర్ల నిర్వాహకులు హైదరాబాద్ కు చెందిన కోడికల్ల శ్రీ అర్చన అనే వారిపై ఒంగోలు టు టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేశారు.

స్పా, మసాజ్ సెంటర్ల పేరుతో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు, అసాంఘిక మరియు అనైతిక కార్యకలాపాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఎక్కడైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

ఈ తనిఖీలో టాస్క్ ఫోర్స్ ఎస్సై లు శివరామయ్య, చెంచయ్య మరియు సిబ్బంది పాల్గొన్నారు.

అదే విధంగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది త్రిపురాంతకం లిమిట్స్ లో పేకాట ఆడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోని రూ.39,740/- మరియు 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీలో ఎస్సై సుదర్శన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *