అన్న కోటి కార్యక్రమములో పాల్గొన్న మర్రి శశిధర్ రెడ్డి.

బేగంపేట అక్టోబర్ 26(జే ఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్ జనరల్ బజార్ లోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసములో జరిగేఅన్నకోటికార్యక్రమములో మాజీ మంత్రి,బీ జే పి జాతీయ కౌన్సిల్ సభ్యులు మర్రి శశిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఆదివారం జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మర్రి మాట్లాడుతూ అన్నదానం మహాదానం అన్నారు.అంతకు ముందు దేవాలయములో మర్రి శశిధర్ రెడ్డి ప్రత్యేక పూజా కార్యక్రమములను నిర్వహించారు. తరువాత ఆలయ అర్చకులు శశిధర్ రెడ్డి ని శాలువులతో సత్కరించి , స్వామి వారి తీర్ధప్రసాదాలను అందజేసినారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త గుమిడెల్లి శ్రీనివాస్ జి. రవీందర్ , స్థానిక బిజెపి నాయకులు వి. దయానంద్ రావు , సి కే నర్సింగ్ రావు , ఎస్సార్ మల్లేశ్ , సి కే శ్రవణ్ , సాయిబాబా, గోపి కిషన్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *