ఒంగోలు పాత రిమ్స్ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న ఆర్.టి.జి.ఎస్. (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ) భవనాన్ని ఆదివారం ఉదయం జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ తో కలసి పరిశీలించారు. జరుగుచున్న పనుల వివరాలు, ఎప్పటికి పూర్తి అవుతాయి తదితర వివరాలను సంబంధిత నిర్మాణ సంస్థ కాంట్రాక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. త్వరగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, నిర్మాణ సంస్థ కాంట్రాక్టర్ ను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యు అధికారి పాల్గొన్నారు.

