ప్రజల భద్రతే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా వర్ష ప్రభావిత ప్రాంతాల్లో వేగవంతమైన చర్యలు – ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు – వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా పర్యవేక్షించి, ట్రాఫిక్ ను సాఫీగా కొనసాగేందుకు తక్షణ చర్యలు- ఒంగోలు పరిసరాల్లో హైవేపైకి వచ్చిన వరదనీటిని జేసీబీల సాయంతో మళ్లించిన అధికారులుతుపాను పరిస్థితుల్లో ప్రజల భద్రతకై ముందుండి కృషి చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు

మొంథా తుపాను ప్రభావంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెరువులు, వాగులు, కాలువలు ఉప్పొంగి, కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరింది. ఈ నేపథ్యంలో ప్రజల భద్రతను కాపాడడమే ముఖ్య లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ అత్యంత చురుకుగా పనిచేస్తున్నారు.
జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, స్వయంగా పలు ప్రదేశాలలోకి వెళ్లి వర్ష ప్రభావిత ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారు. ఒంగోలు పరిసర ప్రాంతాల్లోని పెళ్లూరు చెరువు నీటిమట్టం పెరగడంతో చెరువులోని నీరు ఉదృతంగా నేషనల్ హైవే రోడ్డుపైకి చేరింది. దీనిని గమనించిన ఎస్పీ వెంటనే రెవెన్యూ, మునిసిపల్ మరియు పంచాయతీ విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుని, నీరు రహదారిపై నిలువకుండా తక్షణ చర్యలు చేపట్టారు. జేసీబీ సాయంతో డైవర్ట్ పగలగొట్టి నీటిని క్రింద వైపుకు మళ్లించేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేస్తూ, హైవేపై వాహనాలు నిలిచిపోకుండా, ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
తదుపరి, ఒంగోలు – చీమకుర్తి రహదారిపై ఉన్న పేర్నమిట్ట చెరువు గట్టు తెగి చెరువు నీరు రోడ్డుపైకి రావడంతో అక్కడ కూడా పరిస్థితిని ఎస్పీ స్వయంగా పరిశీలించారు. జేసీబీ యంత్రాలతో నీరు పోయే మార్గం ఏర్పాటు చేసి, రోడ్డుపై నిలిచిన నీటిని క్రింద వైపుకు మళ్లించే చర్యలు చేపట్టారు. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసు సిబ్బందిని నియమించారు.
ఇంకా, నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో చదలవాడ సమీపంలోని జాతీయ రహదారిపై నీరు ప్రవహిస్తున్న విషయం తెలుసుకున్న ఎస్పీ అక్కడకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. చిర్వానంతపురం వైపు వెళ్లే రోడ్డులో నీరు చేరుతున్న దృష్ట్యా ట్రాఫిక్ ను మళ్లించే ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తుపాను నేపథ్యంలో పోలీస్, రెవెన్యూ, మునిసిపల్ సిబ్బంది సమన్వయంతో ప్రజలకు సహాయం అందించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణలో పోలీసులు ఎప్పుడూ ముందుండారన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ట్రాఫిక్ అంతరాయం లేకుండా రహదారులపై నీరు నిల్వ లేకుండా పలు చర్యలు తీసుకోవడం జరిగిందని, ప్రజల భద్రత కోసం ప్రకాశం జిల్లా పోలీసులు రాత్రింబవళ్లు నిరంతరం కృషి చేస్తున్నారని, వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ట్రాఫిక్ సాఫీగా కొనసాగేలా, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
అదే విధంగా డ్రోన్ కెమెరాల ద్వారా లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలను సురక్షింతంగా సుమారు 4,900 మందిని పునరావాస కేంద్రాలకు తరిలిస్తున్నట్లు తెలియచేశారు.
వర్షాల కారణంగా చెరువులు, వాగులు, చప్టాలు పొంగిపొర్లుతున్న పరిస్థితుల్లో ప్రజలు అవసరంలేకుండా ప్రయాణాలు చేయకూదని, పిల్లలు, వృద్ధులు నీటి ప్రవాహాల దగ్గరికి వెళ్లకుండా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసు కంట్రోల్ రూమ్ 112 నంబర్‌ తోపాటు 9121102266 వాట్సాప్ నెంబర్ కు సమాచారం ఇవ్వాలన్నారు.
జిల్లా ఎస్పీ వెంట ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, దర్శి డిఎస్పీ లక్ష్మి నారాయణ, ఎస్బి ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య, ఒంగోలు రూరల్ సీఐ యన్.శ్రీకాంత్ బాబు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పాండు రంగారావు, ఎస్సైలు మరియు సిబ్బంది ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *