భారతీయులలో స్పూర్తిని రగిలిస్తూ ఐక్యతను చాటిన గీతం వందేమాతరం అని వక్తలు అన్నారు. వందేమాతరం గీతం అలపించి 150 సంవత్సరాలు అయిన నందర్భంగా కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో వందేమాతరం గీతాన్ని సామూహికంగా ఆలపించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీఓ అజిత ఆధ్వర్యంలో సమావేశమై గీతాన్ని ఆలపించారు. జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, యూత్ రాష్ట్ర కార్యదర్శి గొల్లపూడి వేణు బాబు, క్లస్టర్’ ఇన్చార్జి వెంకట రావు, ఇడమకంటి శ్రీనివాస రెడ్డి, ఎంఈఓ సుబ్బయ్య, నర్పంచి వలి, సెక్రటరీ షహనాజ్ బేగం, నచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.


