ఆరోగ్యకరమైన సంపూర్ణ ఆహారం తీసుకుని చెడు అలవాట్లను దరిచేయనీయకుండా క్యాన్సర్ ను జయించాలని తాళ్లూరు పీహెచ్సీ వైద్యాధికారి ప్రవీణ్ కుమార్ అన్నారు. తాళ్లూరు పీహెచ్ సి పరధి శుక్రవారం జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ క్యాన్షర్ స్కీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ రాజేష్, సీహెచ్ రమణమ్మ, ఎన్ రవి, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
