ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 11వ తేదీన జిల్లాకు వస్తున్నందున ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు
అధికారులను ఆదేశించారు. పీసీ పల్లి మండలం లింగన్నపాలెం గ్రామంలో మధ్య, చిన్న, సూక్ష్మతరహా పరిశ్రమల ( ఎం.ఎస్.ఎం.ఈ ) పార్కు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వస్తున్నట్లు జిల్లాకు సమాచారం రావడంతో అవసరమైన ఏర్పాట్లు చేయడంపై జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణతో కలిసి కలెక్టర్ శనివారం అన్ని శాఖల ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 11వ తేదీనే ఇటీవలి వర్షాలకు జిల్లాలో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ బృందం కూడా వస్తున్న నేపథ్యంలో సమన్వయ లోపం తలెత్తకుండా
అధికారులకు నిర్దిష్ట విధులు కేటాయించాలని డిఆర్ఓ బి.చిన ఓబులేసును ఆదేశించారు.

