నల్ల బర్లీ అనధికారికంగా సాగు చేస్తే కఠిన చర్యలు తప్పవని వ్యవసాయాధికారి ప్రసాద రావు అన్నారు. లక్కవరం, దోసకాయల పాడు గ్రామాలలో మంగళవారం పొలం పిలుస్తుంది నిర్వహించారు. నల్ల బర్లీ సాగు నిషేదించినందున ఎట్టి పరిస్థితులలో సాగు చేయవద్దని చెప్పారు. పొగాకు బోర్డు అనుమతి మేరకు ఒప్పంద పత్రం అందుతుందని సాగు దారులకు పూర్తి న్యాయం జరుగుతుందని చెప్పారు. సాగు దారులు తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు. విఏఏ చైతన్య, బార్గవి తదితరులు పాల్గొన్నారు.
