ఒంగోలు ఉప రవాణా కమీషనర్ ఆర్ సుశీల అధ్వర్యంలో బుధవారం కాంట్రాక్ట్ క్యారేజి బస్సులు, స్కూల్ బస్సుల డ్రైవర్లకు భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కిమ్స్ సూపర్ స్పేషాలిటీ హాస్పటల్ ఆధ్వర్యంలో డ్రైవర్లకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఉప రవాణా కమీషనర్ అర్ సుశీల మాట్లాడుతూ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి ఆదేశాల మేరకు వాహన డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలతో పాటు, వైద్య పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. వాహన డ్రైవర్లు భద్రతా కూడిన డ్రైవింగ్ చెయ్యాలని నవంబర్ నుండి పిభ్రవరి వరకు మంచు కాలం కనుక మరింత జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో వాహన తనిఖీ అధికారులు కె రామచంద్రా రావు, కిరణ్ ప్రభాకర్, ఎల్ సురేంద్ర ప్రసాద్, ఎన్ జగదీష్ సహాయ మోటార్ వాహన తనిఖీ అధికారులు కె జయ ప్రకాశ్ . ధర్మేంద్ర లు, వైద్యులు పాల్గొన్నారు.
