పొదిలి రాజశేఖర్ రాజు కు రాష్ట్రపతి అవార్డు – రాజశేఖర్ రాజుని సన్మానించిన ప్రజా సంఘాల నాయకులు

జల సంరక్షణలో 2024 సంవత్సరానికి రాష్ట్రపతి చేతుల మీదుగా దర్శికి చెందిన పొదిలి రాజశేఖర్ రాజు అవార్డు అందుకున్నారు.
ఈ సందర్భంగా స్థానిక పొట్టి శ్రీరాములు కాలేజీ లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాజశేఖర్ రాజుని ఘనంగా సన్మానించారు. ఆయన గుంటూరు జిల్లాలో విద్యార్థి దశలో మాజీ ఎస్.ఎఫ్.ఐ నాయకుడిగా పనిచేసి అప్పట్లోనే విద్యార్థుల సమస్యలపై రాజీలేని పోరాటాలు చేసిన వ్యక్తి. స్వచ్ఛంద సంస్థ ద్వారా దాదాపు 200 పైగా వాటర్ షెడ్యూల్ ని ఏర్పాటు చేసి ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో నీటి కొరతగా ఉన్న గ్రామాల్లో ప్రజలను ఒప్పించి ఎంతో కష్టపడి వాటర్ షెడ్యూల్ ని ఏర్పాటు చేశారు. ఇందు ఫలితంగానే ప్రభుత్వం గుర్తించి 2024 సంవత్సరానికి గాను రాష్ట్రపతి అవార్డు రైతుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మ్ చేతుల మీదగా అవార్డు అందుకోవటం గర్వకారణంగా ఉందని అదే స్ఫూర్తి తోటి ప్రతి ఒక్కరూ సమాజానికి ఉపయోగపడేలా డివైఎఫ్ఐ గాని ఎస్ఎఫ్ఐ గాని సిపిఎం గానీ మానవత సంస్థలు గాని లైన్స్ క్లబ్బులు గాని సమాజానికి ఉపయోగపడాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పొదిలి రాజశేఖర్ రాజుని మాజీ డివైఎఫ్ఐ. ఎస్ ఎఫ్ ఐ. సిపిఎం. ప్రజాసంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు.సన్మానించిన వారిలో మాజీ డివైఎఫ్ఐ నాయకులు తాండవ రంగారావు , సందు వెంకటేశ్వరరావు , ఉప్పుటూరి నాగరాజు, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కేవీ పిచ్చయ్య, డివైఎఫ్ఐ నాయకులు బిజ్జం శ్రీనివాసులరెడ్డి, ఎస్ఎఫ్ఐ నాయకుడు అభి, సీనియర్ జర్నలిస్ట్ ,ఎల్ఐసి నాయకులు రాగి పిండి రామకోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *