బేగంపేట డిసెంబర్ 11
(జేఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట శ్యాంలాల్ బిల్డింగులు కొత్తగా ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణంతో తమకు చాలా ఇబ్బందులు తలెత్తుతాయని మహిళలు గురువారం సాయంత్రం మద్యం దుకాణం ఎదుట ఆందోళన నిర్వహించారు. బస్తీకి చెందిన మండల్ రాకేష్ ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి మద్యం దుకాణం ఎదుట ఆందోళన చేశారు. నిత్యం పాఠశాలలకు వెళ్లే చిన్నారులు పనులకు వెళ్లే మహిళలు కు ఈ షాపు ఏర్పాటు వల్ల రక్షణ ఉండదని ట్రాఫిక్ రద్దీ కూడా అధికమవుతుందని వెంటనే కొత్తగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తొలగించాలంటూ వాళ్ళు ప్లకార్డులతో దుకాణం ముందు నిరసన వ్యక్తం చేశారు. మద్యం షాపు వద్దు మహిళలకు ఇబ్బందులు కలిగించవద్దు అంటూ వారు నినాదాలు చేశారు. ఇప్పటికే ఈ విషయమై సంబంధిత శాఖ అధికారులకు పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చామని సంబంధిత శాఖ అధికారులు స్పందించి కొత్తగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని వెంటనే తొలగించాలని లేకుంటే ఆందోళన కొనసాగిస్తామని మహిళలు హెచ్చరించారు ప్రధాన రోడ్డు నుంచి తమ బస్సుల్లోకి వెళ్లే రోడ్డు అసలే ఇరుకుగా ఉంటుందని ఇప్పటికే కొందరు దుకాణదారులు షాపుకు వచ్చిన వాహనాలు రోడ్డుపై నిలుపుతుండటంతో రోడ్డులో ఈ రోడ్లు నిత్యం ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని బైక్లు కార్ల హారంలతో చెవులు పగిలిపోతున్నాయంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు ప్రతినిత్యం బస్తీకి చెందిన విద్యార్థినిలు విద్యార్థులు ఇదే మార్గం గుండా పాఠశాలలకు కళాశాలలకు వెళ్లాల్సి వస్తుందని మహిళలు సైతం నిత్యం ఇదే మార్గంలో వెళ్తుంటారని ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వెంటనే కొత్తగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని ఎక్సైజ్ శాఖ అధికారులు మరోచోటికి తరలించాలని లేదంటే బస్తీ మహిళల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటామని వారు హెచ్చరించారు.



