సికింద్రాబాద్ శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా అయ్యప్పఅన్నదాన కార్యక్రమం

సికింద్రాబాద్ డిసెంబర్ 15
(జే ఎస్ డి ఎం న్యూస్) :
​సికింద్రాబాద్ శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఘనంగా శ్రీ అయ్యప్ప అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.సోమసుందరం వీధి లో అయ్యప్ప స్వామి సేవా దేవా సమితి
సోమానంద్ ధర్మ శాస్త్ర భక్త బృందం సభ్యులు కొవ్వూరి వెంకటేష్ రాజు స్వామి, తేలికుంట వెంకటనారాయణ ల ఆధ్వర్యంలో గత 24 సంవత్సరాలుగా కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం 600 మందికి పైగా అయ్యప్ప స్వాములకు ఇక్కడ నిత్య అన్నదానం నిర్వహిస్తున్నారు.
​ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ తలసాని సాయికిరణ్ యాదవ్ , అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్, డివిజన్ నాయకులతో కలిసి ఆలయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా వారు అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులతో కలిసి శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయం వైభవంగా నిర్మిస్తున్న పునర్నిర్మాణ పనులను పరిశీలించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *