బేగంపేట డిసెంబర్ 17
(జే ఎస్ డి ఎం న్యూస్) :
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను స్థానికులకు, అర్హులైన వారికి మాత్రమే కేటాయించాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం బన్సీలాల్ పేట డివిజన్ జి వై ఆర్ కాంపౌండ్ లోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వాసులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లి లోని కార్యాలయంలో కలిశారు. తమ కాలనీలో ని డబుల్ బెడ్ రూమ్ ఇల్లును స్థానికేత రునికి కేటాయించారని ఎమ్మెల్యే కు పిర్యాదు చేశారు. తమలోనే అర్హులైన వారు ఇంకా ఉన్నారని, వారికి కేటాయించాల్సిన ఇండ్లను అధికారులు ఇతరులకు కేటాయించడం పట్ల వారు తమ ఆవేదనను ఎమ్మెల్యే కు వివరించారు. స్పందించిన ఆయన వెంటనే అధికారులతో ఫోన్ లో మాట్లాడి కేటాయింపు జరగకుండా మిగిలిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను స్థానికులలో అర్హులైన వారికి మాత్రమే ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లో స్థానికేతరులకు కేటాయించవద్దని ఆదేశించారు. అర్హులైన వారిని గుర్తించి ఇండ్లను కేటాయించాలని తాను ఇప్పటికే కలెక్టర్ ను కూడా కోరినట్లు తెలిపారు. ఎమ్మెల్యే ను కలిసిన వారిలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ప్రేమ్ కుమార్, జి వై ఆర్ కాంపౌండ్ అధ్యక్షుడు వెంకట్ బాబు, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు .

