రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి -వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ , దర్శి ఎమ్మెల్యే, డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి

ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అభివృద్ధి కమిటీ చైర్మన్, వైస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. స్థానిక ఆరోగ్య కేంద్రం లో సోమవారం ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అధ్యక్షతన అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డికి వైద్యులు సిబ్బంది ఘన స్వాగతం పలికారు . శాలువ, పూల బొకేలతో ఘనంగా స్వాగతం పలికి, సత్కరించారు. సిబ్బంది , వైద్యులు సమన్వయం తో పని చేసి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ముందుగా ఓ పీ కౌంటర్ వద్ద ఓపి చేస్తున్న విధానం పరిశీలించి రోగులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు రోగులకు సకాలంలో మందులు అందుతున్నాయా లేదా అడిగి తెలుసుకున్నారు. వ్యాధిగస్తులకు ఎన్ని రోజులకు మందులు ఇస్తున్నారు ఆస్పత్రిలో వైద్యులు సిబ్బంది పనితీరు ఎలా ఉంది అని వారిని అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించి వారికి తగు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం వైద్యులతో సమావేశం ఏర్పాటు చేసి ఆస్పత్రిలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.ఆస్పత్రి ప్రాంగణం మొత్తం తిరిగి పరిశీలించి బాత్రూములు డ్రైనేజీ వంటి సౌకర్యాల ఏర్పాటుపై చర్చించారు. ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్న విధానంపై వైద్య సేవ ప్రతినిధులతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తో పలువురు రోగులు తమ సమస్యలను చెప్పుకున్నారు. గర్భిణీలు మాట్లాడుతూ తమకు కూర్చోవడానికి కుర్చీలు లేవని ఓపి అయ్యేవరకు నిలబడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.దీంతో వెంటనే కుర్చీలు ఏర్పాటు చేయిస్తానని శివప్రసాద్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు. అనంతరం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రిలో రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారిని గౌరవించి ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా వైద్య సేవలు అందించాలని సూచించారు. మందులు కొర తలు ఉంటే వెంటనే తెప్పించుకొని పూర్తిస్థాయి వైద్యాన్ని ఆసుపత్రిలోనే అందించాలని చెప్పారు. పేద రోగులు ప్రైవేటు ఆసుపత్రిలోకి వెళ్లకుండా మెరుగైన వైద్యం అందించేందుకు ప్రతి వైద్యులు వైద్య సిబ్బంది కృషి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సూపర్ండెంట్ ఆనందబాబు, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *