హైదరాబాద్‌ నూతన డి సి పి ట్రాఫిక్-1గా బాధ్యతలు స్వీకరించిన అవినాష్ కుమార్.

హైదరాబాద్ జనవరి 19 , (జే ఎస్ డి ఎం న్యూస్) : పునర్వ్యవస్థీకరించిన హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నూతనంగా ఏర్పడిన డి సి పి ట్రాఫిక్-1 (ఖైరతాబాద్ మరియు సికింద్రాబాద్ లా అండ్ ఆర్డర్ జోన్ల పరిధి) బాధ్యతలను అవినాష్ కుమార్ సోమవారం స్వీకరించారు.బాధ్యతలు స్వీకరించిన అనంతరం హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీపీకి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
నూతనంగా బాధ్యతలు చేపట్టిన అవినాష్ కుమార్ ని సీపీ సాదరంగాఆహ్వానించారు. నగరంలోని ట్రాఫిక్ సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి, వాహనదారులకు మరియు ప్రజలకు మెరుగైన సేవలందించే దిశగా సమర్థంగా పనిచేయాలని ఈ సందర్భంగా సీపీ అవినాష్ కుమార్ కు దిశా నిర్దేశం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *