కంటోన్మెంట్ జనవరి 20, (జే ఎస్ డి ఎం న్యూస్) :
కంటోన్మెంట్ ప్రజలపై ప్రేమ మాటల్లో కాదు చేతల్లో చూపండి.కంటోన్మెంట్ కు రావలసిన 100 కోట్ల టిపిటి బకాయిలపై నిరాహార దీక్ష చేస్తే మంచిది.4,5 రోజులకు ఒక సారి వస్తున్న తాగునీటిపై దృష్టిసారించాలి. అంటూ కంటోన్మెంట్ బోర్డ్ నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద మల్లి ఖార్జున్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు సూచించారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలివేటెడ్ కారిడా రోడ్డు వెడల్పు పై ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదన్నారు. నిర్మాణంలో రోడ్డు వెడల్పుపై స్పష్టత ఇవ్వలేదని దీంతో తమ ఆస్తులు కోల్పోతాం అనే భయంతో అనేకమంది ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని ఆమె ఆరోపించారు. వారి తరఫున హెచ్ఎండి వద్ద ధర్నా చేసి స్పష్టత తీసుకురావాలని కోరారు. మాటలతో కాదు పన్నులతో ప్రజలకు సేవ చేయాలనే విషయాన్ని ఎమ్మెల్యే గుర్తించాలన్నారు. ప్రజాప్రతిని గౌరవించడం అందరూ కలిసి ప్రజల అభివృద్ధికి పని చేయడం ప్రజాస్వామ్యం ధర్మమన్నారు నోరు ఉందని ఏమన్నా మాట్లాడటం సరైనది కాదన్నారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ బిజెపి చెందిన నాయకులు కార్యకర్తలు మరియు మహిళా మోర్చా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
