కొర్రపాటి వారి పాలెం కొర్రపాటి లక్ష్మినారాయణ భార్య రమణమ్మకు తెలుగుదేశం పార్టీ దర్శి నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్లు శుక్రవారం సీఎం రిలీఫ్ ఫండ్ రూ.4.12 లక్షల చెక్కును అందజేసారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, తెలుగు యువతరాష్ట్ర కార్యదర్శి వేణుబాబు, క్లస్టర్ ఇన్చార్జి రాచకొండ వెంకట రావు సొసైటీ చైర్మన్ వల్లభనేని సుబ్బయ్య, పోలం రెడ్డి రమణా రెడ్డిలు పాల్గొన్నారు.
