కంటోన్మెంట్ ఫిబ్రవరి 2
(జే ఎస్ డి ఎం న్యూస్) :
బోయిన్పల్లి న్యూ సిటీ కాలనీ శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ సాగుతున్నాయి ఐదు రోజుల నుంచి ఆలయంలో స్వామివారికి వివిధ రకాలైన పూజలు హోమాలు లలితా పారాయణం నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల నేపధ్యంలో పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలి వచ్చి స్వామివారి కి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాలైన పూల మాలలతో, రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా ముస్తాబు చేశారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీదేవి ,భూదేవి సమేత శ్రీవెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. హనుమత్ వాహన సేవ ఆలయ ప్రాంగణంలో కన్నుల పండుగ జరిగింది. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన హోమం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.హనుమత్ వాహన సేవలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జంపన ప్రతాప్,విద్యావతి దంపతులతో పూజలు నిర్వహింపజేసి తీర్థ,ప్రసాదాలను అందజేసి ఘనంగా సత్కరించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ మంగళవారం ఆలయం వద్ద నుంచి ప్రారంభం కానున్న రథయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
నేడు రథయాత్ర……
బోయిన్పల్లి న్యూ సిటీ కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం జరగనున్న రథయాత్ర కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తోపాటు పలువురు రాజకీయ నేతలు వ్యాపారవేత్తలు పాల్గొనే అవకాశం ఉందని, ఆలయ నిర్వహకులు తెలియజేశారు.స్వామి వారి ఊరేగింపు కోసం సుమంత్ రెడ్డి, శిరీష దంపతులు సుమారు 16 లక్షల రూపాయలు రథాన్ని స్వామి వారికోసం చేయించారు. ఈ రథంలోనే స్వామి అమ్మవార్లు ఊరేగింపు నిర్వహించనున్నారు. ఆలయం నుండి ప్రారంభమయ్యే యాత్ర పురవీధులలో తిరిగి ఆలయానికి చేరుకొనుంది. మొట్టమొదటిసారిగా రథయాత్రను నిర్వహిస్తుండటంతో ఎలాంటి అవాంతరములు చోటు చేసుకోకుండా ఆలయ నిర్వాహకులు భక్తులు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రథయాత్రలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కంటోన్మెంట్ బోర్డ్ నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్, తార్డ్ బందు ఈవో నరేందర్ ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ మొత్తం నరసింహ యాదవ్ కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ తదితరులు హాజరుకానున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ రథయాత్రలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ నారాయణ, జగన్నాథం, యాదగిరి,నాగభూషణం, కనక ప్రసాద్, అర్చకులు రంగనాథాచార్యులు, శ్రీకాంత్ చార్యులు భక్తులకు పిలుపునిచ్చారు.


