పొగాకు పంటను పరిశీలించిన పొగాకు బోర్డు దక్షిణప్రాంత నల్లరేగడి నేలల ప్రాం తీయ విస్తరణాధికారి

తాళ్లూరు మండలంలోని కొర్రపాటివారిపాలెం, విఠలాపురం, ముండ్లమూరు, మారెళ్ల గ్రామాల్లో ని పొగాకుపంటను, పొగాకు బ్యారెన్ల వద్ద ఆకు కాల్పులను పొగాకు బోర్డు దక్షిణ ప్రాంత నల్లరేగడి నేలల ప్రాంతీయ విస్తరణాధికారి శీలం రామారావు ఆద్వర్యంలో పొగాకు కంపెనీల ప్రతినిధులు, వెల్లంపల్లి పొగాకుబోర్డు మిత్రబృందం క్షేత్రస్థాయి లో మంగళవారం పరిశీలించారు. పొగాకు తోటలు, ఆకు రెంపు, క్యూరింగ్, గ్రేడింగ్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. పక్వానికి వచ్చిన ఆకులను మాత్రమే రెలవాలని, రెలిచిన ఆకులను టార్బాలిన్ పట్టలపై ఉంచాల న్నారు. బ్యారన్లో కాల్పుకు వేసిన కర్రలను గాలి ప్రసరణ జరిగేటట్టు వుంచుకోవా లన్నారు. క్యూరో మీటర్ ను తప్పని సరిగా వాడాలన్నారు. పక్వానికి రాని ఆకులను బ్యారన్ పై భాగంలో ఉంచాలని సూచించారు. బోర్డు సూచించిన విధంగా తప్పని సరిగా గ్రౌడింగ్ లో గ్రేడు చేయాలన్నారు. తరువాత మార్కెట్లో మేలిని ధర పొంద వచ్చునన్నారు. పంటను పరిశీలించి ఆకులకు పేను బంక వున్నట్లు గుర్తించి కాన్ని డార్ మందును తగిన మోతాదులో వాడాలని తెలిపారు. ఈకార్యక్రమంలో ఒం
గోలుపొగాకు బోర్డు ఆర్ఎం నీలం రామారావు, వెల్లంపల్లి బోర్డు ఎఎస్ కోవి రామకృ ష్ణ, క్షేత్రాధికారి ఆస్ఆర్ఎస్ హర్ష, ఐటీసీ టీమ్ లీడర్ వెంకట్రావు
, పీఎస్ఎస్ టీమ్ లీడర్ ఆర్ల ఆంజనేయులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *