పది, ఇంటర్ ఫలితాల్లో 100% ఉత్తీర్ణతే లక్ష్యం – మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి

సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులందరూ రాబోయే వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, విభిన్న ప్రతిభావంతుల & వయో వృద్ధుల సంక్షేమ మరియు స్వర్ణ గ్రామం & స్వర్ణ వార్డు శాఖామాత్యులు డా. డోలా బాల వీరాంజనేయ స్వామి ఆకాంక్షించారు. మంగళవారం సచివాలయం నుండి రాష్ట్ర డైరెక్టర్ లావణ్య వేణితో కలిసి రాష్ట్రంలోని డిప్యూటీ డైరెక్టర్లు మరియు డీఎస్సీ డబ్ల్యూ అండ్ ఈవో లతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్యాంశాలు ఎలా ఉన్నాయి…
40 రోజుల ప్రణాళిక: పదో తరగతి పరీక్షలకు కేవలం 40 రోజులే సమయం ఉన్నందున, ప్రతి నిమిషాన్ని విద్యార్థుల ప్రగతికి ఉపయోగించాలి. 100% ఉత్తీర్ణత సాధించడమే మన తక్షణ కర్తవ్యం.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
  • గ్రేడింగ్ మెరుగుదల: విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. డి గ్రేడ్ విద్యార్థులు ‘సి’ కి, ‘సి’ వారు ‘బి’ కి, మరియు ‘బి’ గ్రేడ్ విద్యార్థులు ‘ఎ’ గ్రేడ్ సాధించేలా ఉపాధ్యాయులు, అధికారులు ప్రోత్సహించాలి.
  • స్టడీ మెటీరియల్: ప్రభుత్వం అందించిన ‘షైనింగ్ స్టార్’ మరియు ‘రైజింగ్ స్టార్’ పుస్తకాలను విద్యార్థులతో క్షుణ్ణంగా చదివించాలి. ఇవి పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి ఎంతో దోహదపడతాయి.
  • ఇంటర్మీడియట్ ఫలితాలు: ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ విద్యార్థులందరూ తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి. ప్రతిభ గల విద్యార్థులను గుర్తించి వారిని ఉన్నత చదువుల వైపు మళ్ళించాలి. పదో తరగతి పూర్తయిన విద్యార్థులకు ఎంసెట్ ప్రవేశ పరీక్షలపై ఇప్పటి నుండే అవగాహన కల్పించాలి.
  • ఆరోగ్యం – పారిశుధ్యం: పరీక్షల సమయంలో విద్యార్థుల ఆరోగ్యం చాలా ముఖ్యం. వసతి గృహాల్లో మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించడంతో పాటు, పారిశుధ్యం విషయంలో ఎటువంటి రాజీ పడకూడదు.
  • కుటుంబ సభ్యుల్లా చూడాలి: హాస్టల్‌లో చదువుతున్న ప్రతి విద్యార్థిని మన కుటుంబ సభ్యుడిగా భావించి బాధ్యత తీసుకోవాలి. జిల్లాలోని డిప్యూటీ డైరెక్టర్లు తమ పరిధిలోని ఏ ఎస్ డబ్ల్యూ లు మరియు హెచ్ డబ్ల్యు ఓలు కు తగిన దిశానిర్దేశం చేసి, ఈ లక్ష్యాలను అమలు చేయాలి.
    విద్యార్థుల భవిష్యత్తు కోసం అధికారులు మరియు హాస్టల్ వార్డెన్లు పూర్తి అంకితభావంతో పనిచేయాలని మంత్రి గారు ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *