సంక్షేమ పథకాల లబ్ధి పొందేందుకు ఫార్మర్ ఐడీ తప్పనిసరి అని మండల వ్యవసాయాధికారి ప్రసాద రావు చెప్పారు. తాళ్లూరులో ఫార్మర్ ఐడీ పై శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ మండలంలో భూమి హక్కు కలిగిన 500 మంది మహిళలు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు. పురుషులు 1035 మంది ఉన్నట్లు చెప్పారు. ఆధార్, పట్టాదారు పాన్ పుస్తకం, ఆధార్ అనునంధానం కలిగిన మొబైల్ నంబర్ తో రైతు సేవా కేంద్రంలో విఏఏలు సంప్రదించి నమోదు చేసుకోవాలని కోరారు. పీఎం కిసాన్ పంటల భీమా, ఇతర వ్యవసాయ పథకాలకు ఫార్మర్ ఐడీ తప్పనిసరి అని చెప్పారు.
