విద్యాంజలి కార్యక్రమం ద్వారా పాఠశాలల అభివృద్ధికి దాతలు చేయూత ఇవ్వాలని
మండల విద్యాశాఖాధికారి జి నుబ్బయ్య కోరారు. తాళ్లూరు వికే ఉన్నత పాఠశాలలో శనివారం విద్యాంజలి 2.0 శిక్షణ, అవగాహన కార్యక్రమం పీఎంసీ చైర్మన్లకు, నభ్యులకు, ప్రధానోపాధ్యాయులకు, ఎనీఓ సంస్థల సభ్యులకు నిర్వహించారు. ప్రభుత్వంతో పాటు ప్రజల తోడ్పాటు ఉంటే ప్రభుత్వ పాఠశాలలు మరింతగా మౌళిక వనతులు మెరుగుపడేందుకు వీలుగా ప్రభుత్వం విద్యాంజలి కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టినట్లు చెప్పారు. దాతలు విద్యాంజల్లి 2.0 ఆన్లైన్ పోర్టల్ ద్వారా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. పాఠశాలలలో ఫిజికల్, అకాడమిక్ సేవలు తీర్చేవిధంగా పధకాన్ని రూపు దిద్దినట్లు చెప్పారు. ఎనీఓ, కార్పోరేట్, రిటైర్డు ఉద్యోగులు, ఎవరైనా నరే విద్యాంజలి విజయవంతానికి సహకరించవచ్చని ఎంఈఓ -2 సుధాకర్ రావు వివరించారు. హెచ్ ఎంలు ఆర్ పీ అశోక్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
