బేగంపేట ఫిబ్రవరి 9
(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఎంతో పురాతనమైన విఠ లేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కి కృషి చేస్తానని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆలయ నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ రాంగోపాల్ పేట డివిజన్ ఓల్డ్ బోయగూడ లోని విఠ లేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించారు. స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సన్మానించి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో చేపట్టవలసిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఆలయ అభివృద్ధి కి తన సహకారాన్ని అందిస్తానని చెప్పారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ లు అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, అత్తిలి అరుణ గౌడ్, డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కిషోర్, రాంమోహన్, నాగులు, కొండాపురం మహేష్ యాదవ్, టీను గౌడ్, ఓదెల సత్యనారాయణ, చంద్ర ప్రకాష్, ఆలయ నిర్వాహకులు నాగరాజ్, శ్రీధర్, జయసూర్య, అరుణ్ మహరాజ్ తదితరులు ఉన్నారు.


