బేగంపేట, ఫిబ్రవరి 12
( జె ఎస్ డి ఎం న్యూస్ ) :
సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బేగంపేట డివిజన్ ఇండియన్ ఎయిర్ లైన్స్ కాలనీలో సనత్ నగర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోట నీలిమ యువ నాయకుడు అభిషేక్ అడపా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని గురువారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సనత్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, బూత్ స్థాయిలో మరింతం పటిష్టం చేయాలంటే యువత కృషి ఎంతో అవసరమని అన్నారు. యువ నాయకుడు అభిషేక్ అడపా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. బూత్ స్థాయిలో కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని ఆమె వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ గౌస్, అమరం శ్రీనివాసరెడ్డి, సలీం ఖాన్ ,సి. రాజేందర్, అభిషేక్ అడపా, షాజా, ఇబ్రహీం పటేల్, మునీర్ ఖాన్ చంద్రకళ, జ్యోతి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


