మహాశివరాత్రి పర్వదిన పండుగ మరుసటి రోజున జరిగే శ్రీ పార్వతీ సమేత నిర్మ మహేశ్వర స్వామి వార్ల రథోత్సవం పొదిలిలో సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామి వాళ్లను మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాజీ శాసన సభ్యులు అన్నా రాంబాబు, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసుల రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించుకోవడం జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి నర్రా నారాయణరెడ్డి, చైర్మన్ ఒగ్గు వెంకటరామయ్య కమిటీ ఆధ్వర్యంలో రథోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఆలయంలో స్వామి వారిని దర్శించేందుకు పది రూపాయలు అలాగే స్పెషల్ దర్శనానికి వంద రూపాయలు చొప్పున రసీదు రూపంలో వసూలు చేయడం జరుగుతుంది. అలాంటిది ఈ సంవత్సరము స్పెషల్ దర్శనానికి మాత్రమే వంద రూపాయలు మిగతా అందరికీ కూడా ఉచిత దర్శనాన్ని ఏర్పాటు చేయడం పొదిలి శివాలయంలో ఒక వింతైన విశేషంగా మారడమే కాకుండా విఐపి పాసులు కూడా లేకుండా చేసి భక్తులకు స్వామివారిని దర్శించేందుకు అందరికీ అనుకూలంగా చేయడం జరిగింది. మహా శివరాత్రి పండుగ రోజు నుండి భక్తులు భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు ఉండి రాత్రి జాగారం చేసి అర్ధరాత్రి శివాలయంలో అత్యంత పవిత్రంగా నిర్వహించే అభిషేకాన్ని చూసి తరించి, అలాగే ఉపవాసంతో జాగారాన్ని నిర్వహించుకుని రథోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. రథోత్సవం వేడుకను చూసేందుకు ముందుగా తిలకించేందుకు భక్తుల కొరకు అఘోర విన్యాస కార్యక్రమాలు, కోలాట కార్యక్రమాలు నిర్వహిస్తూ రథోత్సవాన్ని నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుండి చుట్టుపక్కల ప్రదేశాల నుండి వచ్చిన భక్తులకు ప్రసాదాలు, చల్లని పానీయాలను స్వచ్ఛందంగా పొదిలిలో విశ్వనాధపురం లోని ఆంజనేయ స్వామి గుడి దగ్గర మొదలుకొని స్థానిక చిన్న బస్టాండ్ వరకు అలాగే రథం రోడ్డు, పెద్ద బస్టాండు, డిపో సెంటర్, దర్శి రోడ్డు ల లో అడుగడుగునా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కుల మత విభేదాలు ఏమీ లేకుండా మనమంతా ఒక్కటే మన ఊరి రథోత్సవము అంటూ స్థానిక చిన్న బస్టాండ్ శివాలయం దగ్గర నుండి భక్తులు గొలుసులతో లాగుతూ చిన్న బస్టాండ్ మీదుగా పెద్ద బస్టాండ్ చేరుకొని పెద్ద బస్టాండ్ నుండి రధం రోడ్డు వరకే పురుషులతో లాగడం జరిగింది. రథం రోడ్డు నుండి శివాలయం వరకు మహిళలు గొలుసులతో రధాన్ని లాగి వారి భక్తిని చాటుకున్నారు. ముందుగా రథానికి అన్నాన్ని కుంభం పోసి రథోత్సవ కార్యక్రమాన్ని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి, అన్న రాంబాబు ప్రారంభించారు. రథాన్ని లాగేందుకు వేల సంఖ్యలో పోటీపడ్డారు . రథోత్సవ కార్యక్రమాన్ని చూసి తిలకించేందుకు వేల సంఖ్యలో రావడం జరిగింది. రథోత్సవం పైన రథసారథిగా రథం నిర్మాణ దాత సామంతిపూడి నాగేశ్వరరావు నిర్వహించడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు కలుగకుండా పొదిలి సీఐ రాజేష్ కుమార్ తన సిబ్బందితో పూర్తిస్థాయి ఈ బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాటూరి పెద్దబాబు, వాకా వెంకట రెడ్డి , ఓబులరెడ్డి , డాక్టర్ ఇమాంసా షేక్ మౌలాలి, షేక్ రసూల్, స్వర్ణ గీత,పండు అనీల్ తానికొండ వెంకట్రావు , నరేష్ , కాటూరి శ్రీను , షబ్బీర్ , యాసిన్ , వివిధ పార్టీల నాయకులు, భక్తులుప్రజలు తదితరులు ఉన్నారు.
