జాతీయ నులి పురుగుల దినోత్సవంను జయప్రదం చెయ్యాలి

జాతీయ నులి పురుగుల దినోత్సవంను జయప్రదం చెయ్యాలని తాళ్లూరు పీహెచ్సీ వైద్యాధికారి ప్రవీణ్, తూర్పుగంగవరం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ మౌనికలు కోరారు. మండలంలో మంగళవారం జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా ఆన్ బెండా జోల్ మాత్రలను పాఠశాలలు, అంగన్ వాడీలలో, నివాసాల వద్ద సంవత్సరం నుండి 19 సంవత్సరాల పిల్లలను వరకు ఉచితంగా అందజేయనున్నట్లు చెప్పారు. తూర్పుగంగవరం పీహెచ్సీ పరిధిలో ఆరోగ్య, ఆశ కార్యకర్తలకు పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ మౌనిక, డాక్టర్ శ్రీకాంత్ రెడ్డిలు పలు సూచనలు చేసారు. పీహెచ్సీ పరిధిలో 5750 మంది పిల్లలను ఆన్ బెండా జోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. హెచ్ ఈఓ చంద్రశేఖర్ బాబు, పీహెచ్ ఎన్ రమణమ్మ, హెచ్ వీ సుశీల తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *