కంటోన్మెంట్ ఫిబ్రవరి 17 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి టిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు 72వ జన్మదిన వేడుకలు కంటోన్మెంట్ పరిధిలో ఘనంగా నిర్వహించారు. కంటోన్మెంట్ మాజీ బోర్డు సభ్యులు జక్కుల మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. న్యూ బోయిన్పల్లి కంటోన్మెంట్ ప్లేగ్రౌండ్ లో కెసిఆర్ 72వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా జక్కుల మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి ప్రదాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని మారుమూల గ్రామాలను సైతం అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చిన ఘనత ఆయన సొంతమని అన్నారు. నీళ్ల కోసం నోళ్లు తెరిచిన బీడు భూములను ప్రాజెక్టులు నిర్మించి సస్యశ్యామలం చేసిన కార్యదీక్షకుడు కేసీఆర్ అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు ఏ పాండు యాదవ్ భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



