ప్రతి విద్యార్థి నైపుణ్యంతో భవిష్యత్లో మరింత రాణిస్తారని జీసీ డీఓ హేమలత అన్నారు. తూర్పుగంగవరం పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఓకేషనల్ ల్యాబ్ ప్రారంబోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ప్రధానోపాధ్యాయులు వైఎస్ ఆర్కే ప్రసాద్, పాఠశాల పిఎంసీ చైర్మన్ షేక్ షంషాద్ బేగం కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్యాంకింగ్, ఇన్యూరెన్స్, హెల్త్ కేర్ సెంటర్ పరికరాలను పరిశీలించారు. విద్యార్థులకు ఆయా ఎక్విప్మెంట్ పై అవగాహన పెంచాలని, ఒకే షనల్ విద్యపై విద్యార్థికి ఆసక్తి పెరిగితే త్వరగా జీవితంలో స్థిర పడతారని అన్నారు. ఓకేషనల్ ట్రైనర్లు అంజి బాబు, సీహెచ్ దావీదులు ఆయా ఎక్విప్ మెంట్ గురించి వివరించారు. అనంతరం కిచేన్ గార్డెన్ ను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న ఒకేషనల్ విద్యపై సంతృప్తి వ్యక్తం చేసారు. జిల్లా ఓకేషనల్ కో ఆర్డినేటర్ కిషోర్, మురళి, సిబ్బంది పాల్గొన్నారు.


