ముస్లింలు రంజాన్ పండగను భక్తిశ్రద్ధ
లతో జరుపుకోవాలని దర్శి సీఐ వై.రామారావు కోరారు. తాళ్లూరు మండలంలోని తూర్పుగంగవరంలో ప్రసిద్ధి చెందిన మర్కజ్ మసీద్ వద్ద బుధవారం ముస్లింలు జానీమాజ్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రంజాన్ మాసం ప్రారంభ సందర్భంగా జాన్ బా కుమారుడు డెక్కన్ క్లాప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ షేక్ మస్తాన్ వలి రామభద్రాపురం, తూర్పుగంగవరం, సోమవరప్పాడు గ్రామాల్లో ఉండే ప్రతి ముస్లిం ఇంటికి నమాజ్ కు సంబంధించిన జానీమాజ్, తజ్ బి ఒక్కపద్దు కార్డు, ఎండు ఖర్జూరం, నమాజ్ పుస్తకం పంపిణీ చేశారు. అనంతరం పోలీసులు ప్రజలకు నూతన క్రిమినల్ చట్టా లపై అవగాహన కల్పించారు. ఎస్సై ఎస్.మల్లికార్జు నరావు, మత పెద్దలు పాల్గొన్నారు.

