కంటోన్మెంట్ ,ఫిబ్రవరి 19,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఛత్రపతి శివాజీ మహారాజ్ గొప్ప పోరాట యోధుడు అని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ అన్నారు.గురువారం కంటోన్మెంట్ గ్రౌండ్ లో స్వామి వివేకానంద సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ 396 వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలలో ముఖ్య అతిథిగా జంపన ప్రతాప్ పాల్గొన్నారు. ముందుగా జంపన శివాజీ చిత్ర పటం వద్ద పూలు ఉంచి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందుత్వ దేశం కోసం శివాజీ పోరాడిన తీరు ఆదర్శమని.నేటి తరం ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో వి ఆర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ నంద కిషోర్, శేషీ రాజ్ యాదవ్,ప్రకాష్,దాదా రావ్,, జిత్తు, కృష్ణ సాయి బాబా యాదవ్ ,బండి శ్రీనివాస్,నరసింహ ,యాదగిరిసత్యనాయన్ తదితరులు పాల్గొన్నారు.
