బేగంపేట, ఫిబ్రవరి 19,
(జే ఎస్ డి ఎం న్యూస్)
సికింద్రాబాద్ లో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా శివాజీ మహరాజ్ జయంతి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. మినర్వా కాంప్లెక్స్ లో రాంగోపాల్ పేట మాజీ కార్పొరేటర్ సుచిత్ర శ్రీకాంత్ లతో కలిసి ఛత్రపతి శివాజీ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూధర్మ సంస్థాపన కోసం శివాజీ పోరాట పఠిమను స్మరించుకొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ను శివాజీ యూత్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో శివాజీ యూత్ సభ్యులు, స్థానిక బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
