కంటోన్మెంట్ ఫిబ్రవరి 19 (జే ఎస్ డి ఎం న్యూస్) :
కంటోన్మెంట్ నియోజకవర్గ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా దివంగత ఎమ్మెల్యే సాయన్న కృషి చేశారని బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ కమిటీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ అన్నారు. సాయన్న వర్ధంతిని పురస్కరించుకొని రసూల్ పురా వార్డు 2 లో 3వెండి కాంపౌండ్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద సాయన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా తాను ఎమ్మెల్యేతో గడిపిన మధుర క్షణాలను గుర్తుచేసుకున్న టిఎన్ భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం టి ఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ
కంటోన్మెంట్ అంటే ఎమ్మెల్యే సాయన్న సాయన్న అంటే కంటోన్మెంట్ గా ఇక్కడి ప్రజలతో ఆయన మమేకమయ్యారని టీఎన్ గుర్తు చేశారు. అనునిత్యం బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ రాజకీయ జీవితాన్ని గడిపిన గొప్ప నాయకుడు సాయన్న అని అన్నారు. కంటోన్మెంట్ ప్రజలలో సాయన్న నేటికీ ఆయన జీవించే ఉన్నారని పేర్కొన్నారు. ఆయన చేసిన అభివృద్ధి ఆయనను గుర్తు చేస్తుందని కంటోన్మెంట్ ప్రజలు ఎప్పటికీ సాయన్న ను మరువరని శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు మిఠాయిలు పండ్లు పంపిణీ చేశారు. మాజీ చైర్మన్ టి ఎన్ శ్రీనివాసులతోపాటు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కుమార్ ముదిరాజ్ మాజీ మార్కెట్ డైరెక్టర్ దేవలపల్లి శ్రీనివాస్ జిఎస్ గోబా బుధం రెడ్డి రాజేష్ నరసింహ వహాబ్ చంద్రకాంత్ యూసుఫ్ స్వామి శ్యామ్ బస్తీ వాసులు చిన్నారులు పాల్గొన్నారు.




