తాళ్లూరు
మండలం లోని తూర్పు గంగవరం గ్రామం లో శనివారం టిడిపి నాయకులు సోమా శ్రీకృష్ణ మురళి ప్రసాద్ , నాగమణి దంపతుల కుమార్తె వివాహా రిసెప్షన్ రంగ రంగ వైభవంగా నిర్వహించారు. మండలంలోని పలువురు రాజకీయ నాయకులు పాల్గొని సందడి చేశారు. వేడుకలో దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ముఖ్యఅతిథిగా పాల్గొని నూతన వధూవరులు వెంకట రంగం- నాగ సాయి అఖిల ను ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో తాళ్లూరు మండల ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, మండల టిడిపి అధ్యక్షులు మేడగం వెంకటేశ్వర రెడ్డి,వైస్ ఎంపీపీ యిడమకంటి వెంకటేశ్వర రెడ్డి,రాష్ట్ర నాటకరంగం కార్పొరేషన్ డైరెక్టర్ బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి, సొసైటీ అధ్యక్షులు సుబ్బయ్య, క్లస్టర్ రాచకొండ వెంకట్రావు, ఏఎంసి డైరెక్టర్లు, గొర్రె సుబ్బారెడ్డి, వలి, సత్యం , యూనిట్ & బూత్ ఇంచార్జ్ లు, స్థానిక నాయకులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. అతిధులకు కార్య నిర్వాహకులు సోమ చిన్న పుల్లయ్య సుశీల, మునగాల చిన్న నాగేశ్వరరావు పద్మ , రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ సోమ ఆంజనేయులు శారద , మీసేవ వెంకట సుబ్బారావు వాణి , రిటైర్డ్ ఆర్టీసీ కండక్టర్ గోలి వెంకటసుబ్బారావు మురళీ మాధవి , దేవాదాయ శాఖ రికార్డ్ అసిస్టెంట్ కోటా శ్రీనివాసరావు విజయలక్ష్మి దంపతులు అతిధులను ఘనంగా ఆహ్వానించారు.





