ముండ్లమూరు మండలంలోని మారెళ్ల గ్రామంలో శ్రీ బిహారీలాల్ ఆరోరా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి శిలా విగ్రహ మహా ప్రతిష్ట కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైనది. మూడు రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
బిహారీలాల్ అరోరా కుటుంబసభ్యులు శ్రీమతి బిహారీ లాల్ ఆరోరా, మయ్యాల పెద్ద ఆంజనేయులు, నాంచారమ్మ, భన్సారీ దాస్ అరోరా, క్రిష్ణ రాణి అరోరా, రాజ్ కుమార్ భన్సారీ దాస్ ఆరోరా, విమల్ రాజ్ కుమార్ ఆరోరా, మనీష్ రాజ్ కుమార్ అరోరా ల కుటుంబసభ్యుల సహకారంతో దేవ దేవుని ఆలయం నిర్మించ తలపెట్టటంతో ఈ ప్రాంత ప్రజలు వారి కుటుంబసభ్యులను అభినందిస్తున్నారు. స్వంత నిధులతో పాటు దాతల సహాకారంతో స్వామి వారి దేవాలయం నిర్మించతలపెట్టినట్లు విమల్ రాజ్ కుమార్ ఆరోరా తెలిపారు. 23 నుండి 25వ తేది వరకు ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. శిలా విగ్రహప్రతిష్టాపకులు అనుమకొండ మచ్చెరికూరి శివ రామ బ్రహ్మర్షి చే 15436వ ప్రతిష్ట నిర్వహించనున్నట్లు తెలిపారు. పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తి శ్రర్థలతో నిర్వహించారు.
సోమవారం ఉదయం గంగ పూజ, కలశ తీర్థం, విఘ్నేశ్వర విష్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, పంచగవ్య, దీక్షా స్వీకరణ, బుత్విగ్వరణలు, పతావిష్కరణ అఖండల ప్రతిష్ట, యంత్ర సంస్కార మంత్ర జపానుష్టానములు, దేవతామూర్తు అభ్యంగ స్నానములు, పంచవ్యస్నపనములు వేదమత్రోచ్చారణల మధ్య నిర్వహించారు. సాయంత్రం మృత్యంగ్రహణం, అకురార్పణ, ప్రధాన కలశ స్థాపని వాస్తు పూజ, అగ్ని ప్రతిష్టా యోగిని, క్షేత్ర పాలన, నవ గ్రహ మండల అవాహనలు, వాస్తు హోమం, జలాధి వాసము, పూజా హారతి, మంత్ర పుష్పం తీర్థ ప్రసాదములు అందించారు.
ప్రధానాచార్యులు రాముగడు గురు బ్రహ్మయోగేశ్వరులు, వీర బ్రహ్మా చార్యులు, నోస్సం సుఖేచార్యులు, నాగ బ్రహ్మా చార్యులు, విశ్వ బ్రహ్మా చార్యుల ఆధ్వర్యంలో పలు ప్రత్యేక ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దేవాలయ శిల్పి ఆర్ నంద కుమార్ స్థాపతి, ఆర్ శశికుమార్ స్థాపతి ల ఆధ్వర్యంలో చక్కగా తీర్చిదిద్దారు.
సోమవారం ఉభయ దాతలు విమర్ రాజ్ కుమార్ ఆరోరా, కె రాధా క్రిష్ణ మూర్తి, కౌసల్య, కె కోటయ్య, రమణమ్మల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు తీర్థ ప్రసాదాలు అందించారు.


