ప్రతి ఒక్కరూ ఆర్ధిక అక్షరాస్యత కలిగి ఉంటే జీవితం
సుఖవంతంగా సాగుతుందని ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఫీల్డ్ అఫీసర్ శివ నాయక్ అన్నారు. తాళ్లూరు ఎబీసీ హైస్కూల్, అయ్యల వారి పాలెం లలో సోమవారం ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంకు, నాబార్డు వారి ఆర్థిక అక్షరాస్యత నిధులు సౌజన్యంతో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సులు నిర్వహించారు. కళాజాత బృదం నాయకుడు ఎన్ జయరావు ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంకు
అందిస్తున్న ఆర్థిక సేవలు, రైతులకు, వివిధ వర్గాల అభ్యున్నతికి అందిస్తున్న రుణాలు, భీమా సౌకర్యాల గురించి ఉదాహరణతో వివరించారు. ఆన్ లైన్ మోసాల గురించి అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అధిక వడ్డీలకు ఆశ పడి కష్టపడి సంపాదించిన సొమ్మును పరుల పాలు చెయ్యవద్దని, బ్యాంకు ఇస్తున్న వడ్డీను పొంది సొమ్ము గ్యారంటీగా పెంపుదల పొందే విధానాన్ని వివరించారు. పలు ఆర్థిక పరమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన వారికి బహుమతులు అందించారు. ఎబీసీ హైస్కూల్ కరస్పాండెంట్ టి. శ్రీనివాస రెడ్డి, ప్రిన్సిపాల్ కె వెంకటేశ్వర రెడ్డి, బీసీలు క్రిష్ణా రెడ్డి, సుధాకర్, బ్యాంకు సిబ్బంది నరసింహా రావు, కళాజాత బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




