ఒంగోలు నగర కార్పోరేషన్ పరిధిలో పేదల గృహ నిర్మాణాలకు నిర్దేశించిన లే అవుట్స్ లో అర్హులైన లబ్దిదారులకు వీలైనంత తొందరగా ఇళ్ళ నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు
అధికారులను ఆదేశించారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్ధన రావు లతో కలసి మున్సిపల్, రెవెన్యు అధికారులతో సమావేశమై ఒంగోలు నగర కార్పోరేషన్ పరిధిలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
పేదలకు ఇళ్ళ నిర్మాణాలు చేపట్టాలన్న లక్ష్యంతో ఒంగోలు నగర కార్పోరేషన్ పరిధిలో అగ్రహారం, యరజర్ల వద్ద లే అవుట్స్ ను వేయడం జరిగిందని, ఈ రెండు లే అవుట్స్ లో అర్హులైన లబ్దిదారులకు వీలైనంత తొందరగా ఇళ్ళ నిర్మాణాలు చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఒంగోలు నగరంలో నిరుపయోగంగా, ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో పిపిపి పద్దతిలో నగర కార్పోరేషన్ కు ఆదాయం వచ్చేలా షాప్స్, మాల్స్ నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్, అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో ఒంగోలు రెవెన్యూ డివిజనల్ అధికారి లక్ష్మి ప్రసన్న, ఒంగోలు మున్సిపల్ కమీషనర్ వెంకటేశ్వర రావు, ఒంగోలు తహసిల్దార్ మధుసూదన్ రావు, రిజిస్ట్రేషన్, సర్వే అధికారులు పాల్గొన్నారు.



