గోల్డెన్ జూబ్లీ సిద్ధమవుతున్న మాజీమంత్రి -తన జీవిత భాగస్వామి కల్పనతో 50 ఏళ్ల దాంపత్య బంధాన్ని గుర్తు చేసుకుంటూ..మార్చి 19వ గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్‌ వేడుక

మాజీ మంత్రి మల్లారెడ్డి గోల్డెన్ జూబ్లీ పెళ్లి వేడుకలకు సిద్ధం అవుతున్నారు . ఈ కార్యక్రమాన్ని సత్యనారాయణస్వామి వ్రతంతో శ్రీకారం చుట్టబోతున్నారు. మార్చి 19న గ్రాండ్‌గా గోల్డెన్ జూబ్లీ జరగబోతోంది. అయితే.. ఈ పెళ్లి.. మల్లారెడ్డి కొడుకుదో.. కూతురుదో.. మనవళ్లు, మనవరాళ్లదో అనుకునేరు.. కాదండోయ్‌… స్వయంగా మల్లారెడ్డే మళ్లీ గోల్డెన్ జూబ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు.. అందుకే.. తమ పెళ్లికి రారండోయ్‌.. అంటూ పెళ్లి వేడుకకు అతిరథ మహారథులను ఆహ్వానించడం ఆసక్తి కలిగిస్తోంది..!

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తన జీవిత భాగస్వామి కల్పనతో 50 ఏళ్ల దాంపత్య బంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ఆమెను మరోసారి సంప్రదాయబద్ధంగా వివాహమాడుతున్నారు. మార్చి 19వ తేదీన జరిగే గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్‌ వేడుకలో భాగంగా.. కొత్త పెళ్లిని తలపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సత్యనారాయణ వ్రతం, హల్దీ, సంగీత్‌ సహా అన్ని కార్యక్రమాలతో ధూమ్ ధాం సందడి చేయబోతున్నారు..!

గురువారం నుంచి మల్లారెడ్డి ఇంట్లో ప్రత్యేక గోల్డెన్ జూబ్లీ పెళ్లి కార్యక్రమాలు షురూ కాబోతున్నాయి.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *