సరస్వతి విగ్రహ 9వ వార్షికోత్సవం నిర్వహణ

సరస్వతి విగ్రహ 9వ వార్షికోత్సవ సందర్బంగా
బొద్దికూరపాడు జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం భక్తి శ్రర్థలతో నిర్వహించారు. బికే పాడు నాయకుడు మూలంరెడ్డి ప్రసాద రెడ్డి, అంజలి ఆధ్వర్యంలో గత 9 సంవత్సరాల క్రితం నరస్వతి విగ్రహాన్ని నిర్మించారు. పూజారి రమణయ్య ఆధ్వర్యంలో మూలం రెడ్డి సాయి సుధీర్ రెడ్డి, వర్ణిక, దేవిక నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పదవ తరగతి విద్యార్థులకు నరస్వతి పూజ నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు సుబ్బా రావు, పీఎంసీ మెంబర్ పొలం రెడ్ది రమణా రెడ్డి, రిటైర్డు హెచ్ఎం సన్నపు రెడ్డి అంజి రెడ్డి ప్రత్యేక పూజలలో పాల్గొని పదవతరగతి విద్యార్థులు 52 మందికి మూలం రెడ్డి ప్రసాద రెడ్డి దాతృత్వంతో జామెట్రీతో పాటు పరీక్షా సామగ్రిని అందజేసారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *