బేగంపేట మార్చి 14
(జేఎస్ డి ఎం న్యూస్) :
పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలంటే చెత్తకుప్పలు పేరుకు పోకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని, కాంగ్రెస్ యువ నాయకుడు అభిషేక్ అడపా పిలుపునిచ్చారు. బేగంపేట డివిజన్ పరిధిలోని ఇండియన్ ఎయిర్ లైన్స్ కాలనీలో చెత్త కుప్పలు పేరుకుపోయి ఉన్న విషయాన్ని అభిషేక్ జిహెచ్ఎంసి శానిటేషన్ డిఇ వెంకటేష్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన డి ఈ వెంటనే సిబ్బందిని రంగంలోకి దింపారు .శనివారం కాలనీకి వచ్చిన జిహెచ్ఎంసి సిబ్బందికి స్థానిక టైక్వాండో బృందం సభ్యులు, కాలనీవాసులు సహకరించి చెత్తను తొలగించారు.
ఈ సందర్భంగా అభిషేక్ మాట్లాడుతూ పరిసరాలను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఎలాంటి రోగాల బారిన పడకుండా ప్రశాంతమైన జీవనాన్ని గడిపే వీలు ఉంటుందన్నారు. జిహెచ్ఎంసి చేపట్టిన ఏ గ్రీన్ వేస్ట్ క్లీనింగ్ డ్రైవ్ కు స్థానికంగా ఉన్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువకులు, సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు నగేష్, గిరిధర్ గోపాల్ ,రవి శానిటేషన్ సిబ్బంది థైక్వాండో బృందం సభ్యులు పాల్గొన్నారు.

