సోమవారం నుండి ప్రారంభం కానున్న పబ్లిక్ పరీక్షలకు ఏర్పాట్లను మండల విద్యాశాఖాధికారి జి సుబ్బయ్య ఆదివారం పరిశీలించారు. బొద్దికూరపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 184 మంది, తూర్పుగంగవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో 249 మంది, వికే ఉన్నత పాఠశాలలో 161 మంది, సరస్వతి అన్ ఎయిడెడ్ పాఠశాలలో 121 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయనున్నారు. ఆయా పరీక్షా కేంద్రాలకు డీఓలుగా చాంద్ బాష, యు వెంకటేశ్వర్లు, సుబ్బలక్ష్మమ్మ, మోహన్ గాంధీ, చీఫ్ లు గా శ్రీనివాస రావు, స్వామి దాసు, శ్రీ రంగ నాయకులు, నవనీతమ్మ లు వ్యవహరించనున్నారు.
