రైతులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు కోరారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా పెట్రోలు, డీజీల్, ఎల్పీజీ కొరత కారణంగా ఎరువుల సరఫరా జాప్యం అయ్యే అవకాశాలు ఉన్నందున రైతులు ముందస్తుగా జాగ్రత్తలు పడాలని సూచించారు. రైతన్న మీకోసం కార్యక్రమం రాజానగరం, మల్కాపురం గ్రామాలలో నిర్వహించారు. యంత్రీకరణ ఎక్కువగా ఉన్న వ్యవసాయం ఉ న్నందున ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని కోరారు. యూరియా ఇతర ఎరువుల సరఫరా దిగుమతుల్లో జాప్యం అయ్యే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయంగా తక్కువ ఎరువులు అవసరం ఉన్న పంటల సాగుపై దృష్టి సారించాలని కోరారు. విఏఏ రాజా తదితరులు పాల్గొన్నారు.
