బేగంపేట మార్చి 18
(జే ఎస్ డి ఎం న్యూస్) :
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ముస్లింలకు సముచిత ప్రాధాన్యం ఇస్తున్నారని కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని బేగంపేట డివిజన్ ప్రకాష్ నగర్ లో ఈద్ కా తోఫా కిట్లను స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూముస్లింల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగా రాష్ట్ర ప్రభుత్వం
కృత నిశ్చయంతో ఉందని అన్నారు. రంజాన్ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు. ముస్లిమ్స్ కోసం ప్రభుత్వం ప్రకటించిన పథకాలనుఉపయోగించుకొని ఆర్థిక అభివృద్ధి సాధించాలని ఈ సందర్భంగా రమేష్ గారు సూచించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, పర్వేజ్, నరేష్ , సుజిత్ గౌడ్ అలీ ,రమాదేవి ,తోచర్ ,జాన్ , అరుణ్ ,ఆసిఫ్ ,తదితరులు పాల్గొన్నారు.

