సీఎం ప్రజావాణిలో 118 దరఖాస్తులు.

హైదరాబాద్ మార్చి 20 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన 209వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 118 దరఖాస్తులు అందాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 39, రెవెన్యూ శాఖకు సంబంధించి 19, ఇందిరమ్మ ఇండ్ల కోసం 32 దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 28 దరఖాస్తులు అందాయి. సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి దరఖాస్తులు స్వీకరించి ప్రజల సమస్యలు విని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పలు సమస్యలను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్, అదనపు కలెక్టర్ సూర్య ప్రకాష్, ఏ.సీ.పీ. ఉమేందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *