బేగంపేట మార్చి 20 . (జే ఎస్ డి ఎం న్యూస్) :
జింఖానా మైదానంలో ఓ మహిళ కారు డ్రైవింగ్ నేర్చుకుంటూ అదుపుతప్పి రాయి కి ఢీకొట్టడంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో మంటలు చెలరేగిన విషయాన్ని గమనించిన మహిళా కారు నుంచి
దూకి తన ప్రాణాలను కాపాడుతుంది. ఇది గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మంటలు భారీగా రావడంతో క్షణంలో కారు పూర్తిగా దగ్ధం అయింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేసరికి కారు పూర్తిగా కాలిపోయింది. కారు నేర్చుకుంటున్న మహిళ కు ఎలాంటి ప్రాణాపాయము జరగక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

