అకాల వర్షాల వలన కలిగే పంటనష్టాలను తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి – జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు

అకాల వర్షాల వలన కలిగే పంటనష్టాలను తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అమరావతి సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. పంటల నష్టం, వంట గ్యాస్ లభ్యత, సంబంధిత
ఇతర అంశాలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. పంటల నష్ట వివరాలను సమగ్రంగా సేకరించాలని చెప్పారు. వంటగ్యాస్ లభ్యతపై ప్రజల్లో అపోహలు కలగకుండా సజావుగా సరఫరా జరిగేలా చూడాలన్నారు. ఇండక్షన్ స్టవ్, పీ.ఎన్.జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం, తదితర మార్గాలపైనా దృష్టి పెట్టాలన్నారు. అనంతరం ఆయా అంశాలపై జిల్లాస్థాయి అధికారులతో కలెక్టర్ చర్చించారు. వాతావరణంలో వచ్చే ఆకస్మిక మార్పుల గురించి మొబైల్స్ ద్వారా ప్రజలకు ముందస్తుగానే సమాచారం వస్తున్నందున పంటలను కాపాడుకునేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. గ్యాస్ సరఫరాలో ఎలాంటి జాప్యం లేకుండా ఏజెన్సీలు, సరఫరాదారులతో ప్రత్యేకంగా చర్చించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ఈ సమావేశంలో డిఎస్ఓ పద్మశ్రీ, ఏపీ సీపీడీసీఎల్ ఎస్.ఈ. వెంకటేశ్వర్లు, జిల్లా పశుసంవర్ధక అధికారి వెంకటేశ్వరరావు, విపత్తుల నిర్వహణ విభాగ డిపిఎం మాధురి, జిల్లా ఉద్యాన అధికారి గోపీ చంద్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు, సిపిఓ సుధాకర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *