రైతులు ప్రస్తుత పరిస్థితులలో డిమాండ్ ఉన్న పంటలనే సాగు చెయ్యాలని
వ్యవసాయాధికారి ప్రసాద రావు అన్నారు. విఠలాపురం కాలనీలో మంగళవారం రైతన్నకు మీకోసం కార్యక్రమం నిర్వహించారు. చిరు ధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనే గింజలు, కూర గాయలు, పండ్లు వాణిజ్య పంటలకు డిమాండ్ బాగా ఉందని ప్రభుత్వం ప్రొత్సహిస్తుందని ఎవో అన్నారు. రైతులు మార్కేట్ పరిస్థితులలో ఎప్పటికప్పుడు అర్థం చేసుకుని సాగు చెయ్యాలని అన్నారు. నరైన ప్రాంతంలో నరైన పంటలు అనేవిషయం రైతులకు తెలియజేస్తున్నట్లు చెప్పారు. స్థిరమైన మార్కేట్ అధిక ఆధాయం పొందే విధంగా దేశ విదేశాల్లో ఎక్కువ డిమాండ్ ఉన్న పంటల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం
ఇస్తున్నట్లు ఎవో తెలిపారు.
