ప్రపంచ ఎర్త్ అవర్స్ సందర్భంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సివి రేణుక మాట్లాడుతూ ప్రపంచ మొత్తం 20 సంవత్సరాల నుండి ఎర్త్ అవర్ జరుపుతున్నారని మన భూమిని మన రక్షించుకోవాలనే ఉద్దేశంతో భూమికి వచ్చే సమస్యలను అందరం కలిసి ఎదుర్కోవాలని అందుకే అవగాహన పెంచుకోవాలని విద్యార్థి చిన్నతనం నుంచే పర్యావరణ పరిరక్షణ మీద ఎనర్జీ సేవ్ చేయడం అవగాహన చేసుకోవాలని తెలియజేశారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రమేష్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

