హైదరాబాద్ మార్చి 30
(జే ఎస్ డి ఎం న్యూస్) :
వైద్య అనుబంధ వృత్తుల నిపుణుల రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటుకై సహకరించండి.అంటూ
వైద్య అనుబంధ వృత్తుల జాయింట్ ఫోరం అధ్యక్ష కార్యదర్శుల డిమాండ్ చేశారు.ఈ మేరకు వారు
అకాడమిక్ వైద్య విద్యా సంచాలకులు డా.శివరాం ప్రసాద్ కి వినతిపత్రం ఇచ్చారు.వైద్య రంగంలో పని చేసే వైద్యులు, ఫార్మసిస్టులు నర్సింగ్ సిబ్బంది తప్ప మిగతా 57 రకాల వైద్య అనుబంధ వృత్తులను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి 2021 మార్చిలో జాతీయ కమిషన్ ఏర్పాటు చేసిందన్నారు. ఈ చట్టం ప్రకారం ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి కౌన్సిల్ ఏర్పాటు చెయ్యాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో సార్లు రాష్ట్రాలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని పలుమార్లు ఆదేశాలు జారీ చేసిందనీ. చివరికి సుప్రీంకోర్టు కూడా రాష్ట్రాలు వెంటనే రాష్ట్ర కౌన్సిల్స్ ఏర్పాటు చెయ్యాలని ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. దేశంలో తెలంగాణ మరియు ఇంకో నాలుగు రాష్ట్రాలు మినహా దాదాపు అన్ని రాష్ట్రాలు స్థానిక కౌన్సిల్ ని ఏర్పాటు చేసుకున్నాయన్నారు.
జాయింట్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షులు దామోదర నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటు చెయ్యడంలో గత ప్రభుత్వం విఫలమైందని, అలాగే నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా తెలంగాణ ప్రభుత్వంలో కౌన్సిల్ ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని వాపోయారు.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వైద్య అనుబంధ వృత్తి నిపుణుల జాతీయ కమిషన్ ఏర్పాటు చేసి ఐదేళ్లు గడిచినా రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటు చేయకపోవడంతో తాము తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనవుతున్నామన్నారు.
కొత్త ప్రభుత్వం వచ్చాక కౌన్సిల్ ఏర్పాటు అవుతుందని ఆశించినా, ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంచాల రవిందర్ ఆవేదన వ్యక్తంచేశారు.రాష్ట్ర కౌన్సిల్ ను వెంటనే ఏర్పాటు చేయాలని ఈ రోజు కేంద్ర వైద్య అనుబంధ వృత్తి నిపుణుల కమిషన్అధ్యక్షులు, నిమ్స్ కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ సిరందాస్ శ్రీనివాసులు , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కొండ నాగరాజు సమక్షంలో వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ శివరాం ప్రసాద్ ని కలిసి రాష్ట్ర కౌన్సిల్ ఆవశ్యకత ప్రాముఖ్యతను వివరించి వినతి పత్రాలు ఇచ్చామని వారు తెలియ జేశారు.
