సికింద్రాబాద్, ఏప్రిల్ 1,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఔత్సాహిక క్రీడాకారులను తమ వంతుగా
ప్రోత్సాహిస్తామని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ అన్నారు. అడ్డగుట్ట కు చెందిన రాజు కుమారులు అభినవ్ , అకాంక్ష లు బాక్సింగ్ లో తమ సత్తాను చాటుకొని జాతీయ స్థాయిలో, ఆసియా స్థాయిలో తమ ప్రతిభను చూపిన నేపధ్యంలో ఎం. ఎల్. ఏ. పద్మారావు గౌడ్ వారిని సికింద్రాబాద్ లోని తమ నివాసంలో బుధవారం సత్కరించారు. ఈ సందర్భంగా యువ నేత రామేశ్వర గౌడ్ వారికి రూ. ఇరవై వేల మేరకు నగదు ప్రోత్సాహకాన్ని అందించారు.
