లక్కవరం పంచాయితీ పరిధిలో పలు కార్యక్రమాలను ఎంపీడీఓ అజిత బుధవారం పరిశీలించారు. నచివాలయం లో రికార్డులను పరిశీలించి ఇంటి పన్నుల వసూలు కార్యక్రమం నిర్వహించారు. ఎన్ టిఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేసారు. పంచాయితీ సమీపంలో చలివేంద్రంను ఏర్పాటు చేసారు. ఎంపీడీఓ తో పాటు మండల టిడిపి పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, ఎఎంసీ డైరెక్టర్ బి ఎన్ హనుమా రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని పెన్షన్లు, చలివేంద్రాన్ని ప్రారంభించారు. మండలంలో మొత్తం 91శాతం పెన్షన్లు పంపిణీ పూర్తి అయినట్లు ఎంపీడీఓ తెలిపారు. కొర్రపాటి వారి పాలెంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పనులను ఎంపీడీఓ పరిశీలించారు. ఎపీఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


